వివాదంలో సంజూ సంబరాలు
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:46 AM
20 వరల్డ్‌క్‌పలో వెస్టిండీ్‌సపై చెలరేగిన సంజూ శాంసన్ మ్యాచ్ ముగిశాక చేసుకున్న సంబరాలు వివాదాస్పదంగా మారాయి. ఫోర్‌తో విన్నింగ్ షాట్ బాదగానే...
కోల్‌కతా: టీ20 వరల్డ్‌క్‌పలో వెస్టిండీ్‌సపై చెలరేగిన సంజూ శాంసన్ మ్యాచ్ ముగిశాక చేసుకున్న సంబరాలు వివాదాస్పదంగా మారాయి. ఫోర్‌తో విన్నింగ్ షాట్ బాదగానే తను చేతిలోని బ్యాట్, హెల్మెట్‌ను చెరోవైపు విసిరేసి కింద కూర్చుని విజయ సంబరాలు చేసుకున్నాడు. అయితే అతడి ప్రవర్తనపై ఐసీసీ దృష్టి సారించింది. నిబంధనల ప్రకారం క్రికెట్‌కు సంబంధించిన వస్తువులను అగౌరవపరుస్తూ నేలకేసి కొట్టడం, విసిరేయడం, తన్నడం కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 అతిక్రమణ కిందికి వస్తుంది. ఇందుకు ఆటగాడిని మందలించడం, 50 శాతం జరిమానా లేక ఒక డీమెరిట్ పాయింట్‌ను విధిస్తారు. అయితే ఇక్కడ శాంసన్ ఉద్దేశపూర్వకంగా, కోపంతో కాకుండా, జట్టును గెలిపించిన భావోద్వేగంలో అలా సంబరాలు చేసుకున్నాడు. కాబట్టి ఐసీసీ మందలింపుతో సరిపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి