Share News

యువీని తొలగించాలని ధోనీ ఎన్నడూ కోరలేదు!

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:03 AM

తన కొడుకు యువరాజ్‌ సింగ్‌ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడని యోగ్‌రాజ్‌ సింగ్‌ తరచూ వాపోతుంటాడు. మహీని విమర్శించడమే పనిగా పెట్టుకొన్న యోగ్‌రాజ్‌.. వారిద్దరి మధ్య...

యువీని తొలగించాలని ధోనీ ఎన్నడూ కోరలేదు!

మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ సందీప్‌ పాటిల్‌

న్యూఢిల్లీ: తన కొడుకు యువరాజ్‌ సింగ్‌ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడని యోగ్‌రాజ్‌ సింగ్‌ తరచూ వాపోతుంటాడు. మహీని విమర్శించడమే పనిగా పెట్టుకొన్న యోగ్‌రాజ్‌.. వారిద్దరి మధ్య సత్సంబంధాలు కూడా ఉండేవి కావని పలుమార్లు చెప్పాడు. కానీ, అవన్నీ అసత్య ఆరోపణలేనని మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ సందీప్‌ పాటిల్‌ చెప్పాడు. యువీని తప్పించమని ధోనీ ఎన్నడూ అడగలేదని పాటిల్‌ స్పష్టం చేశాడు. ‘సెలెక్షన్‌ కమిటీ సమావేశాల్లో, పర్యటనల్లో, మ్యాచ్‌ల సమయంలో ఇలా ఎప్పుడూ కూడా యువీని తప్పించాలని మహీ కోరలేదు’ అని పాటిల్‌ ఓ యూట్యూబ్‌ చానెల్‌తో చెప్పాడు. ‘తనకొడుకు తప్పుచేయలేదని యోగ్‌రాజ్‌ అనుకోవడం సహజమే. కానీ, వేరొకరిపై నింద వేయడం సరికాద’ని సందీప్‌ అన్నాడు.

మహీకి ఊరట..: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో ధోనీకి క్లీన్‌చిట్‌ లభించింది. అతడిపై నమోదైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్‌ అధికారి అయిన రిటైర్డ్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా కొట్టి వేశారు. ఐపీఎల్‌లో ధోనీ పాల్గొనే విషయంలో ఎటువంటి విరుద్ధ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 13 , 2026 | 03:03 AM