రిజ్వీ మళ్లీ..
ABN , Publish Date - Apr 05 , 2026 | 02:35 AM
సూపర్ ఫామ్‌లో ఉన్న సమీర్ రిజ్వీ (51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) మరోసారి మ్యాచ్ విన్నింగ్ అర్ధ శతకంతో విజృంభించడంతో.. ఐపీఎల్‌లో...
ఢిల్లీ వరుసగా రెండో గెలుపు
ముంబైకి తొలి ఓటమి
న్యూఢిల్లీ: సూపర్ ఫామ్‌లో ఉన్న సమీర్ రిజ్వీ (51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) మరోసారి మ్యాచ్ విన్నింగ్ అర్ధ శతకంతో విజృంభించడంతో.. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్లతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 162/6 స్కోరు చేసింది. సూర్యకుమార్ (51), రోహిత్ శర్మ (35) టాప్ స్కోరర్లు. ముకేశ్ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో ఢిల్లీ 18.1 ఓవర్లలో 164/4 స్కోరు చేసి గెలిచింది. పాతుమ్ నిస్సాంక (44) రాణించాడు. హార్దిక్ పాండ్యా అస్వస్థతకు గురి కావడంతో.. సూర్య ముంబై కెప్టెన్‌గా వ్యవహరించాడు. సమీర్ రిజ్వీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
రాహుల్ మళ్లీ విఫలం: ఛేదనలో ఓపెనర్ రాహుల్ (1), నితీశ్ రాణా (0) ఆదిలోనే వెనుదిరగడంతో 7/2తో ఇబ్బందుల్లో పడిన జట్టును సమీర్ రిజ్వీ ఆదుకొన్నాడు. మరో ఓపెనర్ నిస్సాంకతో కలసి మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించిన సమీర్.. మిల్లర్ (21 నాటౌట్) జతగా నాలుగో వికెట్‌కు 39 బంతుల్లో 78 రన్స్ అందించాడు. అయితే సెంచరీకి 10 రన్స్ దూరంలో ఉన్నాడనగా, రిజ్వీని బాష్ అవుట్ చేశాడు. కానీ, మిల్లర్, స్టబ్స్ (3 నాటౌట్) 11 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించారు.
ఆదిలోనే తడబాటు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. ఓపెనర్ రికెల్టన్ (9), తిలక్ (0) వికెట్లను వేగంగా చేజార్చుకొంది. ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్, కెప్టెన్ సూర్య మూడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం జోడించారు. రోహిత్‌ను అక్షర్, హాఫ్ సెంచరీ చేసిన సూర్యను ఎన్‌గిడి అవుట్ చేశారు. రూథర్‌ఫోర్డ్ (5) విఫలమైనా.. నమన్ (28), శాంట్నర్ (18 నాటౌట్) జోరు చూపడంతో ముంబై 160 మార్క్ దాటింది.
స్కోరుబోర్డు
ముంబై: రికెల్టన్ (సి) అక్షర్ (బి) ముకేశ్ 9, రోహిత్ (సి) రాణా (బి) అక్షర్ 35, తిలక్ (సి అండ్ బి) ముకేశ్ 0, సూర్య (ఎల్బీ) ఎన్‌గిడి 51, రూథర్‌ఫోర్డ్ (సి) ముకేశ్ (బి) నిగమ్ 5, నమన్ (సి) స్టబ్స్ (బి) నటరాజన్ 28, శాంట్నర్ (నాటౌట్) 18, బాష్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 162/6; వికెట్ల పతనం: 1-18, 2-18, 3-71, 4-85, 5-122, 6-146; బౌలింగ్: ముకేశ్ 3-0-26-2, ఎన్‌గిడి 4-0-34-1, అక్షర్ 4-0-22-1, విప్రజ్ నిగమ్ 3-0-24-1, కుల్దీప్ 3-0-31-0, నటరాజన్ 3-0-24-1.
ఢిల్లీ: రాహుల్ (సి) రికెల్టన్ (బి) చాహర్ 1, నిస్సాంక (సి) మయాంక్ (బి) శాంట్నర్ 44, నితీశ్ (రనౌట్) 0, సమీర్ రిజ్వీ (సి) తిలక్ (బి) బాష్ 90, మిల్లర్ (నాటౌట్) 21, స్టబ్స్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 18.1 ఓవర్లలో 164/4; వికెట్ల పతనం: 1-2, 2-7, 3-73, 4-151; బౌలింగ్: దీపక్ చాహర్ 3-0-20-1, బుమ్రా 4-0-21-0, శాంట్నర్ 3-0-22-1, శార్దూల్ 3-0-41-0, మయాంక్ 2-0-20-0, బాష్ 3.1-0-39-1.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు