Share News

సాయి సుదర్శన్‌ శతకం

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:25 AM

శ్రీలంక ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (132) శతకంతో రాణించాడు. దీంతో...

సాయి సుదర్శన్‌ శతకం

భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ 333/4

గాలె: శ్రీలంక ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (132) శతకంతో రాణించాడు. దీంతో గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ‘ఎ’ మొదటి ఇన్నింగ్స్‌లో 333/4 పరుగులు సాధించింది. కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ (68 బ్యాటింగ్‌)తో పాటు ఆంధ్ర బ్యాటర్‌ షేక్‌ రషీద్‌ (53 బ్యాటింగ్‌) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ జోడీ ఐదో వికెట్‌కు 116 పరుగులు అందించింది. దేవ్‌దత్‌ (12), రుతురాజ్‌ (22) నిరాశపరిచారు. స్పిన్నర్‌ సుదీరకు రెండు వికెట్లు దక్కాయి.

ఇవి కూడా చదవండి:

పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!

కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!

Updated Date - Jun 26 , 2026 | 04:25 AM