వెల్‌డన్ అర్జున్..
ABN , Publish Date - May 25 , 2026 | 04:19 AM
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరపున సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. పంజాబ్‌తో...
సచిన్ భావోద్వేగం
లఖ్‌నవూ: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరపున సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. పంజాబ్‌తో శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అర్జున్ బరిలోకి దిగాడు. మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ 36 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అయితే నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న అర్జున్ అసలు మ్యాచ్‌లో ఆడేందుకు సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో అర్జున్ తండ్రి, దిగ్గజ క్రికెటర్ సచిన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘పంజాబ్‌తో మ్యాచ్‌లో బాగా ఆడావు. అవకాశం కోసం ఎంతో ఓపికగా సీజన్ ఆసాంతం ఎదురుచూశావ్. హ్యాట్సాఫ్’ అని సచిన్ రాసుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్
ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..