వీళ్లకు ఎదురేలేదు
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:01 AM
వరల్డ్ కప్ గెలిచేందుకు టీమిండియా పూర్తిగా అర్హమైనదని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొనియాడాడు. ‘భారత్ అద్భుతంగా ఆడింది. ట్రోఫీ అందుకొనేందుకు జట్టు పూర్తిగా...
న్యూఢిల్లీ: వరల్డ్ కప్ గెలిచేందుకు టీమిండియా పూర్తిగా అర్హమైనదని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొనియాడాడు. ‘భారత్ అద్భుతంగా ఆడింది. ట్రోఫీ అందుకొనేందుకు జట్టు పూర్తిగా అర్హమైనది. వెల్‌డన్ టీమిండియా.. జైహింద్’ అని సచిన్ అన్నాడు. ‘అహ్మదాబాద్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. టీమిండియా సభ్యులందరికీ, అలాగే భారత క్రికెట్ అభిమానులకు కంగ్రాట్స్’ అని మాజీ సారథి ధోనీ అన్నాడు. కోహ్లీ స్పందిస్తూ.. ‘టీమిండియా అమోఘ విజయం సాధించింది. క్లిష్టమైన తరుణాల్లో జట్టు పోరాటానికి హ్యాట్సాఫ్’ అని అన్నాడు.
సంజూ జీవితం మారిపోయింది: గవాస్కర్
కొద్దిరోజుల కిందటి వరకు జట్టులో సాధారణ ఆటగాడిగా ఉన్న సంజూ శాంసన్ జీవితం ఒక్కసారిగా మారిపోయిందని మరో బ్యాటింగ్ దిగ్గజం గవాస్కర్ ప్రస్తుతించాడు. ‘ప్రపంచ కప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ సంజూకు పీడకల. కానీ వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల తర్వాత ఆటతోపాటు శాంసన్ జీవితం మరో మలుపు తిరిగింది’ అని గవాస్కర్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్