రిటైర్మెంట్ ఆలోచనే లేదు
ABN , Publish Date - Jul 21 , 2026 | 05:05 AM
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను తోసిపుచ్చాడు. ఇప్పట్లో తనకలాంటి ఆలోచన లేదని తేల్చాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే ముగిశాక...
లండన్: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను తోసిపుచ్చాడు. ఇప్పట్లో తనకలాంటి ఆలోచన లేదని తేల్చాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే ముగిశాక ఒక్కసారిగా మీడియాలో రోహిత్ వీడ్కోలుపై కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అతడికి లార్డ్స్ వన్డేనే చివరిదని కూడా పేర్కొన్నాయి. కానీ మూడో వన్డేలో తను అద్భుత శతకంతో విమర్శకులకు దీటుగా బదులిచ్చాడు. ‘దేశం తరఫున ఆడుతూ, బ్యాట్‌తో రాణించడమే నా పని. చాలాకాలంగా నా రిటైర్మెంట్‌పై చర్చలు సాగుతున్నాయి. నేను ఆడుతున్నంతకాలం ఇలాంటి ప్రచారాలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ మైదానంలో నేనేం చేస్తున్నాననేదే నాకు ముఖ్యం. అయినా అలాంటి ప్రచారం లేకపోతే మజా ఉండదు’ అని రోహిత్ బీసీసీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. మరోవైపు వన్డే కెప్టెన్ గిల్ కూడా రోహిత్ వీడ్కోలుపై స్పందించాడు. రోహిత్ రిటైర్మెంట్‌పై డ్రెస్సింగ్‌రూమ్‌లో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
యమాల్ విజయం వెనుక నానమ్మ త్యాగం.. కష్టాల నుంచి ప్రపంచ స్టార్‌గా..!
రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన