రోహిత్‌కు ముంబై పగ్గాలు?
ABN , Publish Date - May 08 , 2026 | 02:13 AM
ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ మరోసారి సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం రాయ్‌పూర్‌లో...
న్యూఢిల్లీ: ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ మరోసారి సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం రాయ్‌పూర్‌లో బెంగళూరుతో ముంబై తలపడాల్సి ఉంది. అయితే, రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌కు తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే, సూర్య భార్య ప్రసవించడంతో అతడు ఇంటికి వెళ్లినట్టు సమాచారం. దీంతో బెంగళూరుతో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. మరోవైపు హార్దిక్ కూడా జట్టుతోపాటు ప్రయాణించలేదట. దీంతో జట్టు నాయకత్వ బాధ్యతలను మరోసారి రోహిత్‌కు అప్పగిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక పదవికి రాజీనామా