నాకు స్థలం ఇప్పించండి!
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:11 AM
ఉత్తరాఖండ్‌లో నివాసం ఉండేందుకు స్థలం ఇప్పించాలంటూ టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామిని కోరడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం...
ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి రిషభ్ పంత్ ‘ఎక్స్’లో విజ్ఞప్తి
స్పందించిన సీఎం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో నివాసం ఉండేందుకు స్థలం ఇప్పించాలంటూ టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామిని కోరడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న పంత్ శుక్రవారం అర్ధరాత్రి ‘ఎక్స్’ ఖాతాలో.. ఢిల్లీ నుంచి తన మకాంను స్వరాష్ట్రమైన ఉత్తరాఖండ్‌కు మార్చాలనుకుంటున్నట్టు తెలిపాడు. ‘ఉత్తరాఖండ్‌లో ఉండేందుకు అనువైన, విశాలమైన స్థలం కోసం మూడేళ్లుగా వెతుకుతున్నా. ఈ విషయంలో మీ సహకారం కావాలనుకుంటున్నా. గతంలో నాకు కేటాయించాల్సిన భూమి విషయం కూడా పెండింగ్‌లో ఉంది. మీరు అనుమతిస్తే ప్రభుత్వ ధర ప్రకారం కొనుగోలు చేస్తా’ అని పంత్ ఖాతా నుంచి వచ్చిన రెండు పోస్టుల్లో ఉంది. దీనికి సీఎం పుష్కర్ కూడా స్పందిస్తూ.. పంత్ అడిగిన అంశాలకు సంబంధించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తానని శనివారం ఉదయం తెలిపారు. మరోవైపు ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్ ఇంకా ప్రభుత్వ సాయం కోరడమేమిటని, ఒకవేళ అతడి సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయ్యిందేమోనని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, తన ఖాతా హ్యాక్ అయిందా లేదా అన్నదానిపై పంత్ మాత్రం ఇంకా స్పందించకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ ఔట్!
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. మూడు సార్లు 6 వికెట్లు