లఖ్‌నవూ కెప్టెన్సీకి పంత్ రాజీనామా
ABN , Publish Date - May 30 , 2026 | 02:05 AM
ఐపీఎల్ ఫ్రాంచైజీ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నాయకత్వ బాధ్యతల నుంచి రిషభ్ పంత్ వైదొలిగాడు. 2025 వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరతో...
లఖ్‌నవూ: ఐపీఎల్ ఫ్రాంచైజీ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నాయకత్వ బాధ్యతల నుంచి రిషభ్ పంత్ వైదొలిగాడు. 2025 వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరతో అతడిని తీసుకున్న లఖ్‌నవూ యాజమాన్యం కెప్టెన్ పదవిని కూడా అప్పగించింది. అయితే గత రెండేళ్లుగా పంత్ సారథ్యంలో ఎల్‌ఎస్‌జీ తీవ్రంగా నిరాశపర్చింది. తాజా సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో నాలుగింట్లో మాత్రమే గెలిచి అట్టడుగున నిలిచింది. ఓవరాల్‌గా ఈ రెండేళ్లలో జట్టు నెగ్గింది పది మ్యాచ్‌ల్లోనే కావడం గమనార్హం. అలాగే పంత్ బ్యాటింగ్ రికార్డు కూడా అంత గొప్పగా లేదు. పంత్ తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఫ్రాంచైజీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
కేన్ విలియమన్స్ వరల్డ్ రికార్డ్
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్