వన్డేల్లోనూ చోటు గల్లంతు?
ABN , Publish Date - May 01 , 2026 | 02:22 AM
ఈసారి ఐపీఎల్‌లో వైఫల్యా ల ప్రభావం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ జాతీయ జట్టు అవకాశాలపైనా తీవ్రంగా...
పంత్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ : ఈసారి ఐపీఎల్‌లో వైఫల్యా ల ప్రభావం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ జాతీయ జట్టు అవకాశాలపైనా తీవ్రంగా పడేలా ఉంది. టీ20 జట్టుకు పంత్‌ను ఇప్పటికే దూరం పెట్టగా..తాజాగా వన్డేలనుంచి కూడా అతడిని దూరం పెట్టనున్నట్టు సమాచారం. 50 ఓవర్ల ఫార్మాట్‌లో పంత్‌కు బదులు రెండో వికెట్ కీపర్, బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేయాలని కోచ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ భావిస్తున్నారట. వన్డేలలో ప్రధాన కీపర్‌గా కేఎల్ రాహుల్ బ్యాధతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌తోపాటు ఐపీఎల్‌లోనూ రాణిస్తున్న నేపథ్యంలో సెలెక్టర్లు సంజూ పట్ల మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి:
ముంబై జట్టుకు మద్దతుగా వాంఖడే స్టేడియానికి వినోద్ కాంబ్లీ
రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్! జైలా..ఫైనా?