కోల్‌కతా వైస్ కెప్టెన్ రింకూ
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:21 AM
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్ నియమితుడయ్యాడు. భవిష్యత్ సారథిగా అతడిని తయారు చేసేందుకే...
కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్ నియమితుడయ్యాడు. భవిష్యత్ సారథిగా అతడిని తయారు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. కెప్టెన్ అజింక్యా రహానెకు రింకూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తాడని కోల్‌కతా సీఈవో వెంకీ మైసూర్ చెప్పాడు. హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపాడు. రింకూలో సహజ నాయకుడున్నాడని అన్నాడు.
ఇవి కూడా చదవండి:
థామస్ కప్2026: భారత్ జట్టుకు సారథ్యం వహించనున్న లక్ష్య సేన్
ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్