రింకూ ఇంట విషాదం
ABN , Publish Date - Feb 28 , 2026 | 02:35 AM
భారత క్రికెటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ఖాన్‌చంద్ సింగ్ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు...
తండ్రి ఖాన్‌చంద్ మృతి
అలీగఢ్: భారత క్రికెటర్ రింకూ సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ఖాన్‌చంద్ సింగ్ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వ్యాధి స్టేజి 4కు చేరడంతో ఖాన్‌చంద్‌ను ఈనెల 21న గ్రేటర్ నొయిడాలోని ఓ ఆస్పత్రిలో చేర్చించి వెంటిలేటర్‌పై చికిత్సనందించారు. పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో రింకూ జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందే ఆస్పత్రికి వచ్చి, తిరిగి వెంటనే మళ్లీ చెన్నైలో ఉన్న టీమ్‌తో చేరాడు. కానీ తండ్రి మృతి వార్త తెలిశాక వెంటనే రింకూ స్వస్థలానికి చేరుకున్నాడు. ఇక విండీ్‌సతో జరిగే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడో? లేదో? తెలియాల్సి ఉంది. అటు రింకూ తండ్రి మృతిపై మాజీ క్రికెటర్లు సచిన్, యువరాజ్, హర్భజన్ సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలో పనిచేస్తూ.. ఖాన్‌చంద్ తన కొడుకు క్రికెటర్‌గా ఎదిగేందుకు ఎంతగానో తోడ్పడ్డారు.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ