వారికోసం11 సీట్లు ఖాళీగా..
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:16 AM
గతేడాది విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు...
తొక్కిసలాట మృతులకు ఆర్సీబీ నివాళి
బెంగళూరు: గతేడాది విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఘనంగా నివాళులర్పించనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ ఆడే ముందు జరిగే వామప్ సెషన్‌లో ఆటగాళ్లందరూ 11 నెంబర్ జెర్సీలనే ధరించనున్నారు. అంతేకాకుం డా మృతి చెందిన వారి జ్ఞాపకార్థం చిన్నస్వామి స్టేడియం లో మ్యాచ్ జరిగే రోజుల్లో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచాలని బెంగళూరు ఫ్రాంచైజీ పరిశీలిస్తోంది. శనివారం చిన్నస్వామిలో జరిగే లీగ్ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో ఆర్సీబీ తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
థామస్ కప్2026: భారత్ జట్టుకు సారథ్యం వహించనున్న లక్ష్య సేన్
ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్