Share News

2 ఓవర్లే వేస్తే..2 కోట్లు తగ్గించాలి

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:51 AM

గతేడాది మినీ వేలంలో కామెరూన్‌ గ్రీన్‌ను రూ.25 కోట్లకు కోల్‌కతా జట్టు తీసుకోవడంతో.. అతను ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు....

2 ఓవర్లే వేస్తే..2 కోట్లు తగ్గించాలి

గ్రీన్‌పై అశ్విన్‌

న్యూఢిల్లీ: గతేడాది మినీ వేలంలో కామెరూన్‌ గ్రీన్‌ను రూ.25 కోట్లకు కోల్‌కతా జట్టు తీసుకోవడంతో.. అతను ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అయితే పని ఒత్తిడి భారం కారణంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అతడిని లీగ్‌లో నాలుగు ఓవర్లపాటు బౌలింగ్‌ వేసేందుకు అనుమతిస్తుందా? అని మాజీ స్పిన్నర్‌ ఆశ్విన్‌ ప్రశ్నించాడు. ‘రూ. 25 కోట్లు పెట్టి తీసుకుంటే ఒక్క ఓవర్‌ మాత్రమే బౌలింగ్‌ వేస్తానంటే ఆ జట్టు పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే ప్రదర్శన ఆధారంగానే ప్లేయర్లకు ఒప్పంద మొత్తం ఇచ్చేలా నిబంధన మార్చాలి. ఒకవేళ రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ వేస్తే రూ.2 కోట్లు తగ్గించాలి’ అని అశ్విన్‌ సూచించాడు.

ఇవి కూడా చదవండి:

అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్

రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..

Updated Date - Mar 22 , 2026 | 05:51 AM