Share News

వాన్‌డర్‌ డుస్సెన్‌ వీడ్కోలు

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:13 AM

దక్షిణాఫ్రికా క్రికెటర్‌ రస్సీ వాన్‌డర్‌ డుస్సేన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే తన దేశవాళీ జట్టు ది లయన్స్‌ తరఫున మాత్రం కొనసాగుతానని 37 ఏళ్ల వాన్‌డర్‌ తెలిపాడు...

వాన్‌డర్‌ డుస్సెన్‌ వీడ్కోలు

జొహాన్నె్‌సబర్గ్‌: దక్షిణాఫ్రికా క్రికెటర్‌ రస్సీ వాన్‌డర్‌ డుస్సేన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే తన దేశవాళీ జట్టు ది లయన్స్‌ తరఫున మాత్రం కొనసాగుతానని 37 ఏళ్ల వాన్‌డర్‌ తెలిపాడు. 2018లో జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన తను సౌతాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలోనూ బరిలోకి దిగాడు. 2019, 2023 వన్డే వరల్డ్‌క్‌పలతో పాటు 2021 టీ20 మెగా టోర్నీలోనూ ప్రాతినిధ్యం వహించాడు. నాలుగేళ్ల క్రితమే చివరి టెస్టు ఆడిన వాన్‌డర్‌కు ఏడాదిగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ చోటు దక్కడం లేదు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 18 టెస్టుల్లో 905 రన్స్‌, 71 వన్డేల్లో 6 శతకాలతో 2657 రన్స్‌, 57 టీ20ల్లో 1406 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: అరుదైన మైలురాయిని తాకిన అజింక్య రహానే

ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Apr 03 , 2026 | 01:13 AM