Share News

బెంగాల్‌ 199 స్కోరుకు 5 వికెట్‌లు

ABN , Publish Date - Feb 08 , 2026 | 03:52 AM

సుదీప్‌ కుమార్‌ ఘరామి (112 నాటౌట్‌) అజేయ శతకంతో ఆదుకోవడంతో.. ఆంధ్రతో రంజీ క్వార్టర్స్‌లో బెంగాల్‌ కోలుకొంది....

బెంగాల్‌ 199 స్కోరుకు 5 వికెట్‌లు

ఆంధ్ర 295 ఆలౌట్‌

కల్యాణి (బెంగాల్‌): సుదీప్‌ కుమార్‌ ఘరామి (112 నాటౌట్‌) అజేయ శతకంతో ఆదుకోవడంతో.. ఆంధ్రతో రంజీ క్వార్టర్స్‌లో బెంగాల్‌ కోలుకొంది. అంతకుముందు ఆటకు రెండో రోజైన శనివారం ఓవర్‌నైట్‌ స్కోరు 264/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర 295 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్‌ కుమార్‌ 5, ఆకాశ్‌ దీప్‌ 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బెంగాల్‌ 199/5 స్కోరు చేసింది. 43/3తో కష్టాల్లో పడిన సమయంలో సుదీప్‌, సూరజ్‌ సింధు (20) నాలుగో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Also Read:

రెపో.. లేదు మార్పు

మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Updated Date - Feb 08 , 2026 | 03:52 AM