టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ఊహించని ప్లేయర్!
ABN , Publish Date - May 27 , 2026 | 05:39 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. బెంగళూరు ఫైనల్‌కు చేరడంలో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక పాత్ర పోషించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ వరుసగా రెండోసారి తమ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బెంగళూరు ఫైనల్‌కు చేరడంలో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక పాత్ర పోషించాడు. పాటిదార్ కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్ ద్వారా పాటిదార్ వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్సీ పరంగా వందకు వంద మార్క్‌లు కొట్టేశాడు. ఈ నేపథ్యంలో పాటిదార్ బ్యాటింగ్, కెప్టెన్సీ నైపుణ్యంపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 17 ఓవర్‌లో ఓవర్‌లో కగిసో రబాడా బౌలింగ్‌లో పాటిదార్ ఆడిన షాట్‌ను అశు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 'కగిసో రబాడా వేసిన ఓ ఫాస్ట్ డెలివరీని పాటిదార్ బ్యాక్‌ఫుట్‌పై వెళ్లి కొట్టిన సిక్స్.. 'షాట్ ఆఫ్ ది డే' అని చెప్పవచ్చు. బహుశా ఈ టోర్నమెంట్‌లోనే అత్యుత్తమ షాట్‌గా ఇది నిలుస్తుంది. ఆ పొజిషన్ నుంచి అతను అంత పవర్‌ను ఎలా జనరేట్ చేయగలిగాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు' అని అశ్విన్ పేర్కొన్నాడు.
'ఈ ఇన్నింగ్స్‌కు ముందు వరకు కెప్టెన్సీ, బ్యాటింగ్ పరంగా పాటిదార్ కంటే శ్రేయస్ అయ్యర్ కొంచెం బెటర్‌గా కన్పించాడు. కానీ ఈ మ్యాచ్‌తో పాటిదార్ శ్రేయస్‌ను వెనక్కి నెట్టాడు. సాధారణంగా పాటిదార్ స్పిన్ బౌలింగ్‌లో బాగా ఆడుతాడని అందరికీ తెలుసు. కానీ గుజరాత్ మ్యాచ్‌లో అతడు ఫాస్ట్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు అద్భుతం. రషీద్ ఖాన్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌ను అతడు ఎదుర్కొన్న తీరు కూడా నన్ను ఆకట్టుకుంది' అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
కాగా ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ లేదా సంజు శాంసన్ టీమిండియా టీ20 కెప్టెన్ అవుతారని ప్రచారం జరిగింది. తాజాగా పాటిదార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పాటిదార్‌కు కూడా టీమిండియా కెప్టెన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!
సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!