‘రాజస్థాన్’ కొనుగోలు రేసులో మిట్టల్!
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:45 AM
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు రేసులోకి గ్లోబల్ స్టీల్ జెయింట్ ఆర్సిలర్ మిట్టల్ ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం....
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు రేసులోకి గ్లోబల్ స్టీల్ జెయింట్ ఆర్సిలర్ మిట్టల్ ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం. దాదాపు రూ. 9288 కోట్లకుపైగా విలువైన వాటాను అమ్మేందుకు రాయల్స్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. మరోవైపు తమ స్పోర్ట్స్ వ్యాపారాన్ని మిట్టల్ ఫ్యామిలీ మరింతగా విస్తరించాలనుకొంటోంది. అమెరికాలో ప్రసిద్ధి చెందిన ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్ లీగ్‌లో బోస్టన్ సెల్టిక్స్ జట్టులో మిట్టల్ కంపెనీ వాటాను ఖరీదు చేసింది. కాగా, మంగళవారం డెడ్‌లైన్ ముగిసే సమయానికి ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికా స్పోర్ట్స్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిజర్ కూడా కొనుగోలు చేసేందుకు బిడ్‌లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..