ఆ రాజసం దక్కాలని..
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:13 AM
ఐపీఎల్ తొలి సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆ తర్వాత మరోసారి టైటిల్ నెగ్గడం గగనమే అయ్యింది. 2021లో తుదిపోరుకు వచ్చినా రన్నర్‌పతోనే సరిపెట్టుకుంది. గత సీజన్‌లో తీవ్ర నిరాశాజనక...
బలమైన జట్టుతో బరిలోకి జూరెండో టైటిల్ వేటలో రాజస్థాన్
ఐపీఎల్ 6 రోజుల్లో
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
ఐపీఎల్ తొలి సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆ తర్వాత మరోసారి టైటిల్ నెగ్గడం గగనమే అయ్యింది. 2021లో తుదిపోరుకు వచ్చినా రన్నర్‌పతోనే సరిపెట్టుకుంది. గత సీజన్‌లో తీవ్ర నిరాశాజనక ప్రదర్శన కనబరచింది. 14 మ్యాచ్‌ల ద్వారా కేవలం 8పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంతో ముగించింది. దాంతో జట్టును పునర్ నిర్మించుకుని ఈ సీజన్‌కు సిద్ధమైంది. సీనియర్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని భారీ మొత్తానికి దక్కించుకుంది. ఇంకా..పలువురు దేశవాళీ ఆటగాళ్లను తీసుకుంది.
బలం
బెరుకులేని, దూకుడైన యువ బ్యాటర్లతో రాజస్థాన్ రాయల్స్ కళకళలాడుతోంది. లీగ్‌లో మరే జట్టు ఈ విషయంలో రాజస్థాన్‌కు సాటిరాదు. యశస్వీ జైస్వాల్, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీల ఓపెనింగ్ ద్వయం ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నం. వీరి దూకుడైన ఆరంభాలను మిడిలార్డర్‌లో రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ కొనసాగించగలరు. లువాన్ ప్రిటోరియస్ పవర్ హిట్టింగ్‌తో స్కోరు మరింత దూసుకుపోవడం ఖాయం. హెట్‌మయెర్ ఫినిషర్ పాత్ర గురించి చెప్పేదేముంది. రాజస్థాన్ బౌలింగ్ అలా..ఇలా..లేదు. ప్రారంభంలో జోఫ్రా ఆర్చర్ పదునైన బౌలింగ్‌తో తిప్పలు పెడితే..డెత్ ఓవర్లలో సందీప్ శర్మ పరుగులను నియంత్రించగలడు. మధ్య ఓవర్లలో బిష్ణోయ్ కళ్లెం వేస్తాడు. జడేజా, మపకా, మిల్నేలను ఎదుర్కొని ప్రత్యర్థి జట్లు పరుగులు చేయడం ఆషామాషీ కాదు.
అవకాశం
ప్లేఆఫ్స్ రేసులో తప్పకుండా ఉంటుంది. జట్టు సత్తా కోణంలో చూస్తే టాప్-4లో ఉండాలి. ఇందుకు జట్టు కూర్పును సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసుకోవాలి. అలాగే పరాగ్ ఎలా రాణిస్తాడనేది కూడా కీలకం.
బలహీనత
మిడిలార్డర్ బ్యాటింగే రాజస్థాన్‌కు ప్రధాన సమస్య. జైస్వాల్, పరాగ్, జురెల్, హెట్‌మయెర్ ఉన్నారు సరే..వీరు విఫలమైతే ఎవరు అంటే సమాధానం లభించదు. అలాగే బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నా..ఆర్చర్, సందీప్ శర్మలలో నిలకడలేమి సమస్య. యువ బౌలర్లు మపాక, యుధ్‌వీర్ సింగ్, కుల్దీప్ సేన్, నాండ్రే బర్గర్ ప్రతిభావంతులైనా అత్యున్నతస్థాయిలో ఆడిన అనుభవం తక్కువ.
జట్టు
బ్యాటర్లు: హెట్‌మయెర్, శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్, డొనవాన్ ఫెరీరా, లువాన్ డ్రె ప్రిటోరియస్, రవీసింగ్, పేరాల అమన్‌రావు.
ఆల్‌రౌండర్లు: రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్.
బౌలర్లు: ఆడమ్ మిల్నే, బ్రిజేశ్ శర్మ, జోఫ్రా ఆర్చర్, కుల్దీప్ సేన్, క్వెనా మపాక, నాండ్రే బర్గర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, సుశాంత్ మిశ్రా, తుషార్ దేశ్‌పాండే, విఘ్నేశ్ పుతూర్, యశ్‌రాజ్ పంజా, యుధ్‌వీర్ సింగ్ చరక్.
ఇవి కూడా చదవండి:
అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్
రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..