రాజస్థాన్ బిడ్డింగ్ నుంచి తప్పుకోలేదు
ABN , Publish Date - May 06 , 2026 | 01:18 AM
రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేసే చాన్స్ చేజారడంపై కల్ సోమాని కన్సార్టియం నిరాశ వ్యక్తం చేసింది...
సోమాని గ్రూప్ ప్రకటన
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేసే చాన్స్ చేజారడంపై కల్ సోమాని కన్సార్టియం నిరాశ వ్యక్తం చేసింది. అయితే, బిడ్డింగ్ నుంచి తాము తప్పుకోలేదని తెలిపింది. సోమాని నేతృత్వంలోని కన్సార్టియం నిధుల సమీకరణలో ఆలస్యమవడంతో.. స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ అండ్ కో రూ. 15,600 కోట్లకు రాజస్థాన్‌ను దక్కించుకొంది. దీంతో, బిడ్డింగ్ నుంచి సోమానీ గ్రూప్ తప్పుకొందని రాజస్థాన్ యాజమాన్యం ప్రకటించింది. ‘మొత్తం ప్రక్రియను ముగించడానికి 6 నెలల గడువు కోరాం. కానీ, మాపై ఒత్తిడి తెచ్చారు. నిధులకు ఎలాంటి లోటూ లేదు. బిడ్డింగ్ నుంచి తప్పుకోలేద’ని సోమానీ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్