వైభవ్‌ధనాధన్
ABN , Publish Date - Apr 11 , 2026 | 05:23 AM
ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర సాగిస్తోంది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78) మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఫలితంగా శుక్రవారం రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుతో..
నేటి మ్యాచ్‌లు
పంజాబ్ X సన్‌రైజర్స్ మ.3.30 (చండీగఢ్)
చెన్నై X ఢిల్లీ రా.7.30 (చెన్నై)
15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
అజేయంగా నిలిచిన జురెల్
బెంగళూరుకు రాజస్థాన్ ఝలక్
గువాహటి: ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర సాగిస్తోంది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78) మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఫలితంగా శుక్రవారం రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్లతో నెగ్గింది. ఆర్‌ఆర్‌కిది వరుసగా నాలుగో గెలుపు కాగా.. ఆర్‌సీబీకిది తొలి ఓటమి. ధ్రువ్ జురెల్ (43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 నాటౌట్) కడదాకా నిలిచి ఆకట్టుకున్నాడు. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (40 బంతుల్లో 63), విరాట్ (16 బంతుల్లో 7 ఫోర్లతో 32), వెంకటేశ్ (15 బంతుల్లో 29 నాటౌట్) రాణించారు. బిష్ణోయ్, ఆర్చర్, బ్రిజేశ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ఛేదనలో రాజస్థాన్ 18 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసి గెలిచింది. జడేజా (24 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. క్రునాల్, హాజెల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా వైభవ్ నిలిచాడు.
ఏమా బాదుడు..: భారీ ఛేదనలో ఓపెనర్ వైభవ్ తుఫాన్ ఆటతీరుకు రాజస్థాన్ స్కోరు రాకెట్‌లా దూసుకెళ్లింది. పవర్‌ప్లేలోనే రాయల్స్ ఏకంగా 97 రన్స్ సాధించింది. ఓపెనర్ జైస్వాల్ (13) రెండో ఓవర్‌లోనే వెనుదిరగ్గా.. అటు హాజెల్‌వుడ్ ఓవర్‌లో వైభవ్ వరుసగా 4,4,4,6తో 19 రన్స్ రాబట్టాడు. భువీని సైతం వదలకుండా 6,6,4 బాదేసిన వైభవ్.. 15 బంతుల్లోనే ఈ సీజన్‌లో తన పేరిటే ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీని సమం చేశాడు. మరో ఎండ్‌లో జురెల్ ఆరో ఓవర్‌లో 4,6,4,6,4తో 24 రన్స్ రాబట్టాడు. ఇక డేవిడ్ ఓవర్‌లోనూ వైభవ్ రెండు సిక్సర్లు బాదగా.. స్పిన్నర్ క్రునాల్ అతడి జోరుకు చెక్ పెట్టాడు. తొమ్మిదో ఓవర్‌లో వరుస బంతుల్లో వైభవ్, హెట్‌మయెర్ (0) వికెట్లు తీయడంతో రాజస్థాన్ నెమ్మదించింది. అయితే రెండో వికెట్‌కు 37 బంతుల్లోనే 108 పరుగుల మెరుపు భాగస్వామ్యం లభించింది. కెప్టెన్ పరాగ్ (3) సైతం నిరాశపర్చాడు. ఆనక జురెల్, జడేజా సింగిల్స్‌పైనే దృష్టి సారించారు. 25 బంతుల్లోనే జురెల్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా.. ఐదో వికెట్‌కు జడేజాతో కలిసి అజేయంగా 68 పరుగులు నమోదు చేసి మ్యాచ్‌ను ముగించాడు.
ఆదుకున్న రజత్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆరంభం పేలవంగా సాగినా.. ముగింపులో మాత్రం అదరగొట్టింది. ఇందుకు కెప్టెన్ రజత్ పటీదార్ ఒంటరి పోరాటమే కారణం. ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లు చకచకా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో ఓ దశలో ఆర్‌సీబీ 125/7 స్కోరుతో దీనంగా కనిపించింది. అప్పటికి 14 ఓవర్లు పూర్తికాగా, చేతిలో మూడు వికెట్లే ఉన్నాయి. ఈ స్థితిలో కనీసం నిర్ణీత ఓవర్లయినా ఆడుతుందా? అనిపించింది. కానీ రజత్ టెయిలెండర్లతో చక్కటి భాగస్వామ్యాలు ఏర్పరుస్తూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ (29 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు 200 దాటింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ సాల్ట్ (0)ను పేసర్ ఆర్చర్ అవుట్ చేశాడు. అయితే విరాట్, దేవ్‌దత్ ఎడాపెడా షాట్లు ఆడడంతో తొలి మూడు ఓవర్లలోనే 45 పరుగులు సాధించింది. ఓ దశలో 61/3 స్కోరుతో పటిష్టంగా కనిపించినా స్వల్ప వ్యవధిలోనే మరో మూడు వికెట్లు కోల్పోయింది. ఇక డెత్ ఓవర్లలో రజత్ భారీ సిక్సర్లతో ఆకట్టుకుని 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 18వ ఓవర్‌లో అతడిని సందీప్ అవుట్ చేయగా.. వెంకటేశ్ ఆ తర్వాతి రెండు ఓవర్లు నిదానంగా ఆడాడు. కానీ ఆఖరి ఓవర్‌లో మాత్రం 4,6,6తో 21 రన్స్ అందించి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు.
స్కోరుబోర్డు
బెంగళూరు: సాల్ట్ (సి) జురెల్ (బి) ఆర్చర్ 0, విరాట్ (బి) బిష్ణోయ్ 32, దేవ్‌దత్ (సి) హెట్‌మయెర్ (బి) ఆర్చర్ 14, పటీదార్ (సి) ఫెరీరా (బి) సందీప్ 63, క్రునాల్ (సి) హెట్‌మయెర్ (బి) బిష్ణోయ్ 1, జితేశ్ (ఎల్బీ) బ్రిజేశ్ 5, డేవిడ్ (సి) హెట్‌మయెర్ (బి) బ్రిజేశ్ 13, షెఫర్డ్ (సి) బ్రిజేశ్ (బి) జడేజా 22, వెంకటేశ్ (నాటౌట్) 29, భువనేశ్వర్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 201/8. వికెట్ల పతనం: 1-0, 2-45, 3-58, 4-62, 5-76, 6-94, 7-125, 8-166; బౌలింగ్: ఆర్చర్ 3-0-33-2, బర్గర్ 3-0-32-0, సందీప్ 4-0-47-1, బిష్ణోయ్ 4-0-32-2, జడేజా 2-0-14-1, బ్రిజేశ్ 4-0-37-2.
రాజస్థాన్: జైస్వాల్ (సి) సందీప్ (బి) హాజెల్‌వుడ్ 13, వైభవ్ (సి) కోహ్లీ (బి) క్రునాల్ 78, జురెల్ (నాటౌట్) 81, హెట్‌మయెర్ (సి) హాజెల్‌వుడ్ (బి) క్రునాల్ 0, పరాగ్ (సి) క్రునాల్ (బి) హాజెల్‌వుడ్ 3, జడేజా (నాటౌట్) 24, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 18 ఓవర్లలో 202/4; వికెట్ల పతనం: 1-21, 2-129, 3-129, 4-134; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-37-0, హాజెల్‌వుడ్ 4-0-44-2, అభినందన్ 3-0-54-0, క్రునాల్ 4-0-30-2, డేవిడ్ 1-0-18-0, షెఫర్డ్ 2-0-18-0.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..
బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్