Share News

ఆఖరి బంతికి

ABN , Publish Date - Apr 05 , 2026 | 02:45 AM

గుజరాత్‌ టైటాన్స్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ ఊపిరి పీల్చుకుంది. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ నాలుగు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దీంతో...

ఆఖరి బంతికి

నేటి మ్యాచ్‌లు

సన్‌రైజర్స్‌ X లఖ్‌నవూ మ.3.30 (హైదరాబాద్‌)

బెంగళూరు X చెన్నై రా.7.30 (బెంగళూరు)

గుజరాత్‌పై రాజస్థాన్‌ విజయం

అహ్మదాబాద్‌: గుజరాత్‌ టైటాన్స్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ ఊపిరి పీల్చుకుంది. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ నాలుగు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దీంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో రాయల్స్‌ వరుసగా రెండో మ్యాచ్‌ నెగ్గింది. అటు టైటాన్స్‌కిది రెండో ఓటమి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. ధ్రువ్‌ జురెల్‌ (42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 75), యశస్వీ జైస్వాల్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55), వైభవ్‌ సూర్యవంశీ (18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) రాణించారు. రబాడకు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సాయి సుదర్శన్‌ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 73), బట్లర్‌ (26), కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (24), రబాడ (23 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా బిష్ణోయ్‌ నిలిచాడు.

ఆఖర్లో ఉత్కంఠ: భారీ ఛేదనకై బరిలోకి దిగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ మినహా ఎవరూ రాణించలేదు. మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ బిష్ణోయ్‌ నాలుగు వికెట్లతో దెబ్బతీశాడు. చివర్లో రషీద్‌, రబాడ జోడీ పోరాడినా ఫలితం లేకపోయింది. ఓపెనర్‌ కుషాగ్ర (18)తో కలిసి తొలి వికెట్‌కు సుదర్శన్‌ 78 రన్స్‌ జత చేశాడు. అర్ధసెంచరీ తర్వాత 11వ ఓవర్‌లో సుదర్శన్‌ను బిష్ణోయ్‌ అవుట్‌ చేశాడు. బిష్ణోయ్‌ తన తర్వాతి ఓవర్‌లోనే ఫిలిప్స్‌ (3), సుందర్‌ (4)లను పెవిలియన్‌కు చేర్చడంతో టైటాన్స్‌ ఒత్తిడిలో పడింది. బట్లర్‌ కాసేపే క్రీజులో నిలువగా.. హిట్టర్‌ రాహుల్‌ తెవాటియా (12), షారుక్‌ (11) విఫలమయ్యారు. అయితే ఆఖర్లో రషీద్‌, రబాడ పోరాటం చూపడంతో మ్యాచ్‌ ఆఖరి బంతి వరకు వెళ్లింది. కానీ, ఆరు బంతుల్లో 11 రన్స్‌ కావాల్సిన వేళ పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే కట్టడి చేశాడు. రషీద్‌ వికెట్‌ తీయడంతో పాటు నాలుగు పరుగులే సమర్పించుకొని మ్యాచ్‌ను రాజస్థాన్‌ వశం చేశాడు.


జురెల్‌, జైస్వాల్‌ జోరు: టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీనికి తగ్గట్టుగానే ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌, వైభవ్‌ చెలరేగడంతో పవర్‌ప్లేలో జట్టు 69 రన్స్‌ చేసింది. వైభవ్‌ జోరును ఏడో ఓవర్‌లో స్పిన్నర్‌ రషీద్‌ అడ్డుకోవడంతో తొలి వికెట్‌కు 70 పరుగుల మెరుపు భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత జురెల్‌, జైస్వాల్‌ గుజరాత్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో పది పరుగుల రన్‌రేట్‌తో జట్టు స్కోరు దూసుకెళ్లింది. హాఫ్‌ సెంచరీ తర్వాత జైస్వాల్‌ను రబాడ బౌల్డ్‌ చేయగా.. రెండో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (8), హెట్‌మయెర్‌ (18) విఫలమైనా జురెల్‌ ఎదురుదాడికి దిగి 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివరి ఓవర్‌లో జురెల్‌ వెనుదిరిగినా అప్పటికే స్కోరు 200 దాటింది.

స్కోరుబోర్డు

రాజస్థాన్‌: జైస్వాల్‌ (బి) రబాడ 55, వైభవ్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రషీద్‌ 31, జురెల్‌ (సి) బట్లర్‌ (బి) సిరాజ్‌ 75, పరాగ్‌ (సి) కుషాగ్ర (బి) ప్రసిద్ధ్‌ 8, హెట్‌మయెర్‌ (సి) సిరాజ్‌ (బి) అశోక్‌ 18, ఫెరీరా (సి) ఫిలిప్స్‌ (బి) రబాడ 1, జడేజా (నాటౌట్‌) 7, ఆర్చర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 210/6. వికెట్ల పతనం: 1-70, 2-126, 3-135, 4-165, 5-166, 6-205. బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-48-1, రబాడ 4-0-42-2, అశోక్‌ శర్మ 4-0-37-1, ప్రసిద్ధ్‌ 4-0-43-1, రషీద్‌ 4-0-39-1.

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) తుషార్‌ (బి) బిష్ణోయ్‌ 73, కుషాగ్ర (సి) హెట్‌మయెర్‌ (బి) పరాగ్‌ 18, బట్లర్‌ (సి) సందీప్‌ (బి) బర్గర్‌ 26, ఫిలిప్స్‌ (సి) ఆర్చర్‌ (బి) బిష్ణోయ్‌ 3, సుందర్‌ (సి) జడేజా (బి) బిష్ణోయ్‌ 4, తెవాటియా (సి) జురెల్‌ (బి) బిష్ణోయ్‌ 12, షారుక్‌ (రనౌట్‌) 11, రషీద్‌ (సి) ఆర్చర్‌ (బి) తుషార్‌ 24, రబాడ (నాటౌట్‌) 23, అశోక్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 204/8. వికెట్ల పతనం: 1-78, 2-107, 3-127, 4-131, 5-133, 6-155, 7-161, 8-204. బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-38-0, బర్గర్‌ 3-0-29-1, సందీప్‌ 3-0-34-0, తుషార్‌ 3-0-24-1, జడేజా 2-0-25-0, పరాగ్‌ 1-0-11-1, బిష్ణోయ్‌ 4-0-41-4.

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 02:45 AM