రాహుల్ మెరుపు శతకం
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:33 AM
టీజీ20 లీగ్‌లో కరీంనగర్ డైమండ్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం మెదక్ ఫాల్కన్స్‌తో...
కరీంనగర్ ఘన విజయం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టీజీ20 లీగ్‌లో కరీంనగర్ డైమండ్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరీంనగర్ 133 పరుగులతో గెలిచింది. తొలుత కరీంనగర్ 4 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు చేసింది. రాహుల్ రాధేష్ మెరుపు శతకం (48 బంతుల్లో 101)తో చెలరేగగా, చందన్ సహాని అర్ధ శతకం(56)తో రాణించాడు. ఛేదనలో ఆశిష్ శ్రీవాత్సవ్ (2/13), శుభం శర్మ (2/16) బౌలింగ్ ధాటికి మెదక్ 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. శతక వీరుడు రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇవి కూడా చదవండి
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!