రాధే రాధే.. జై శ్రీరామ్
ABN , Publish Date - May 06 , 2026 | 01:36 AM
లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ రఘు శర్మ కెరీర్‌లో తొలి వికెట్ సాధించగానే భావోద్వేగానికి లోనయ్యాడు. అక్షత్‌ను అవుట్...
స్పిన్నర్ రఘు శర్మ సంబరాలు
ముంబై: లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ రఘు శర్మ కెరీర్‌లో తొలి వికెట్ సాధించగానే భావోద్వేగానికి లోనయ్యాడు. అక్షత్‌ను అవుట్ చేసిన వెంటనే తన జేబులో నుంచి ఓ కాగితం తీసి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపడం అందరినీ ఆకర్షించింది. ‘రాధే రాధే.. గత 15 ఏళ్లు ఎంతో బాధగా ముగిశాయి. ఆ గురుదేవుని దయ వల్ల నేటితో ఆ బాధ తీరింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్‌కు ధన్యవాదాలు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను.. జై శ్రీరామ్’ అని అందులో ఉంది. ఇప్పుడీ నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది ముంబై జట్టులో చేరిన 33 ఏళ్ల రఘు ఈనెల రెండున చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసినా వికెట్ తీయలేకపోయాడు.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్