ప్రతికా స్థానంలో ప్రియ
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:32 AM
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి జరిగే చారిత్రక టెస్టులో తలపడే భారత జట్టులో...
భారత జట్టులో మార్పు
రేపటి నుంచి లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు
లండన్: ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి జరిగే చారిత్రక టెస్టులో తలపడే భారత జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. మోకాలి గాయం కారణంగా ఓపెనర్ ప్రతికా రావల్ మ్యాచ్‌కు దూరమైంది. దీంతో ఆమె స్థానంలో ప్రియా పూనియాను జట్టులోకి తీసుకున్నట్టు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. 2019లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీ్‌స ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్రియ.. ఇప్పటిదాకా భారత్ తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడింది.
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్