Share News

ముజరబానిపై చట్టపరమైన చర్యలు!

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:04 AM

కాంట్రాక్ట్‌ నిబంధనలను ఉల్లంఘించిన జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజరబానిపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చట్టపరమైన చర్యలు తీసుకోనుంది...

ముజరబానిపై చట్టపరమైన చర్యలు!

కాంట్రాక్ట్‌ ఉల్లంఘనపై పాక్‌ బోర్డు సీరియస్‌

లాహోర్‌: కాంట్రాక్ట్‌ నిబంధనలను ఉల్లంఘించిన జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజరబానిపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చట్టపరమైన చర్యలు తీసుకోనుంది. వాస్తవంగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్టు తరఫున ఆడేందుకు ముజరబాని ఇంతకుముందే ఒప్పందం చేసుకొన్నాడు. అయితే, బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ స్థానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నుంచి అవకాశం రావడంతో ముజరబాని.. పీసీబీతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకొని ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. గతేడాది నుంచి ఐపీఎల్‌, పీఎ్‌సఎల్‌ ఒకేసారి జరుగుతుండడంతో ఆటగాళ్లు ఏదో ఒక్కటే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. వెస్టిండీస్‌ పేసర్‌ షామర్‌ జోసెఫ్‌ స్థానంలో ముజరబానిని ఇస్లామాబాద్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.

ఇవి కూడా చదవండి:

పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ

పాకిస్థాన్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్..

Updated Date - Mar 15 , 2026 | 06:04 AM