Share News

పాక్‌ క్రికెటర్లపై జరిమానా?

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:13 AM

చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8 దశ నుంచే నిష్క్రమించిన తమ జట్టుపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈనేపథ్యంలో జట్టుపై జరిమానా విఽధించాలని పీసీబీ...

పాక్‌ క్రికెటర్లపై జరిమానా?

కరాచీ: చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8 దశ నుంచే నిష్క్రమించిన తమ జట్టుపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈనేపథ్యంలో జట్టుపై జరిమానా విఽధించాలని పీసీబీ యోచిస్తోంది. ఒక్కో క్రికెటర్‌కు రూ. 5 లక్షలు (పాక్‌ కరెన్సీలో) జరిమానాగా విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ఆటగాళ్ల వేతనాల నుంచి మినహాయించనున్నట్టు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆటగాళ్లపై జరిమానా విధించాలన్న ఆలోచన సరికాదని పీసీబీలో కొందరు వాదిస్తున్నట్టు సమాచారం. పీసీబీతో కేంద్ర కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లు ప్రతినెలా జీతాలు అందుకుంటారు. ఇవిగాక మ్యాచ్‌ రుసుముతోపాటు బోనస్‌, జట్టు స్పాన్సర్‌షి్‌పలతో బోర్డు అందుకొనే మొత్తాలలో కొంత భాగం కూడా క్రికెటర్లకు అందజేస్తారు. కాగా..మెగా టోర్నీలో పాకిస్థాన్‌ ప్రదర్శన పీసీబీనే కాదు..ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కూడా నిరాశకు లోను చేసినట్టు తెలిసింది.

ఇవి కూడా చదవండి:

విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

Updated Date - Mar 03 , 2026 | 03:13 AM