Share News

గొడవకు దిగిన డోగ్రా..

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:32 AM

మ్యాచ్‌లో అనుచిత ప్రవర్తనకు గాను జమ్మూ కెప్టెన్‌ పరాస్‌ డోగ్రా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత పడింది. అసలేం జరిగిందంటే.. పేసర్‌ కృష్ణ సంధించిన వరుస షార్ట్‌ బాల్స్‌...

గొడవకు దిగిన డోగ్రా..

మ్యాచ్‌లో అనుచిత ప్రవర్తనకు గాను జమ్మూ కెప్టెన్‌ పరాస్‌ డోగ్రా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత పడింది. అసలేం జరిగిందంటే.. పేసర్‌ కృష్ణ సంధించిన వరుస షార్ట్‌ బాల్స్‌ ఆడే క్రమంలో డోగ్రా ఇబ్బందిపడ్డాడు. ఈ సమయంలో సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కర్ణాటక సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ అనీష్‌ ఏదో కామెంట్‌ చేశాడు. దీంతో సహనం కోల్పోయిన డోగ్రా నేరుగా అనీష్‌ వద్దకు వచ్చి అతడి తలను తన తలతో ఢీ కొట్టాడు. అయితే, ఆ సమయంలో ఇద్దరూ హెల్మెట్లు ధరించి ఉన్నారు. వాగ్వాదం పెరగడంతో ఫీల్డ్‌ అంపైర్లు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఉద్దేశపూర్వకంగా దాడికి దిగడంతో డోగ్రాపై క్రమశిక్షణ చర్యల కింద మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు.

ఇవి కూడా చదవండి:

మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

టీ20 ప్రపంచ కప్: న్యూజిలాండ్ మెరుపులు..

Updated Date - Feb 26 , 2026 | 05:32 AM