Share News

మెదక్‌పై పాలమూరు గెలుపు

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:21 AM

రోహిత్‌ రాయుడు (54 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ్‌ అర్ధశతకంతో రాణించడంతో.. టీజీ20లో పాలమూరు 5 వికెట్ల తేడాతో మెదక్‌ ఫాల్కన్స్‌పై...

మెదక్‌పై పాలమూరు గెలుపు

హైదరాబాద్‌: రోహిత్‌ రాయుడు (54 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ్‌ అర్ధశతకంతో రాణించడంతో.. టీజీ20లో పాలమూరు 5 వికెట్ల తేడాతో మెదక్‌ ఫాల్కన్స్‌పై గెలిచింది. తొలుత మెదక్‌ 20 ఓవర్లలో 164/9 స్కోరు చేసింది. విక్రమ్‌ (36), వరుణ్‌ (36) టాప్‌ స్కోరర్లు. రవి, రిషభ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో పాలమూరు 17.5 ఓవర్లలో 165/5 చేసి నెగ్గింది. విఘ్నేష్‌ (39) ఫర్వాలేదనిపించాడు. వరుణ్‌ 2 వికెట్లు దక్కించుకొన్నాడు. మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఈ-చాంప్స్‌ 6 వికెట్ల తేడాతో రంగారెడ్డి రైజర్స్‌పై గెలిచింది.

ఇవి కూడా చదవండి:

పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!

కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!

Updated Date - Jun 26 , 2026 | 04:21 AM