Share News

పాక్‌ జట్టుకు డబుల్‌ షాక్‌

ABN , Publish Date - May 16 , 2026 | 02:43 AM

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడిన పాకిస్థాన్‌ జట్టుకు ఐసీసీ షాకిచ్చింది. ఏకంగా ఎనిమిది...

పాక్‌ జట్టుకు డబుల్‌ షాక్‌

డబ్ల్యూసీ పాయింట్లలో కోత, జరిమానా

దుబాయ్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడిన పాకిస్థాన్‌ జట్టుకు ఐసీసీ షాకిచ్చింది. ఏకంగా ఎనిమిది ఓవర్లు ఆలస్యంగా వేయడంతో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పలో ఆ జట్టు 8 పాయింట్లను కోల్పోయింది. అంతేకాకుండా పాక్‌ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 40శాతం కోత విధించారు. డబ్ల్యూటీసీ నాలుగో సీజన్‌లో పాక్‌ ఆడింది మూడు టెస్టులు కాగా.. రెండింట్లో ఓడి ఒక్క విజయంతో ఉంది. ఓవరాల్‌గా 8వ స్థానంలో ఉన్న పాక్‌ ఖాతాలో ఇప్పుడు కేవలం 4 పాయింట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు ఒక్కో స్లో ఓవర్‌కు మ్యాచ్‌ ఫీజులో 5 శాతం జరిమానా, ఓ పాయింట్‌ను కోల్పోతుంది.

ఇవి కూడా చదవండి:

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

Updated Date - May 16 , 2026 | 02:45 AM