పాక్ చచ్చీచెడీ..
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:02 AM
టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-ఎలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై అతికష్టమ్మీద గెలిచింది. తొలుత...
3 వికెట్లతో గెలుపు
భయపెట్టిన నెదర్లాండ్స్
కొలంబో: టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-ఎలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై అతికష్టమ్మీద గెలిచింది. తొలుత నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (37), బాస్ డి లీడ్ (30) టాప్ స్కోరర్లు. సల్మాన్ మీర్జా 3.. నవాజ్, అబ్రార్ అహ్మద్, సలీమ్ తలో 2 వికెట్లు దక్కించుకొన్నారు. ఛేదనలో పాక్ 19.3 ఓవర్లలో 148/7 స్కోరు చేసి గెలిచింది. ఫహీమ్ అష్రఫ్ (29నాటౌట్) మ్యాన్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెర్న్ చెరో రెండు వికెట్లు తీశారు. చివరి 12 బంతుల్లో 29 పరుగులు కావల్సి ఉండగా.. 19వ ఓవర్‌లో ఒ డౌడ్ క్యాచ్ చేజార్చడంతో బతికి పోయిన ఫహీమ్ మూడు సిక్స్‌లు, ఫోర్‌తో 24 పరుగులు రాబట్టడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.
ఇవి కూడా చదవండి:
అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!