పునరాలోచనలో పాకిస్థాన్
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:00 AM
అన్నీ అనుకున్నట్టు జరిగితే టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత ఆసక్తికర భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బందులూ లేనట్టే.. ఎందుకంటే పాక్ బాయ్‌కాట్ నిర్ణయాన్ని...
భారత్‌తో మ్యాచ్ కోసం లంక మధ్యవర్తిత్వం
కొలంబో: అన్నీ అనుకున్నట్టు జరిగితే టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత ఆసక్తికర భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బందులూ లేనట్టే.. ఎందుకంటే పాక్ బాయ్‌కాట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) తమ ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌ను ఆడాల్సిందిగా ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు లేఖ కూడా రాసింది. పాక్‌లో పర్యటించేందుకు ఏ జట్టూ ముందుకురాని పరిస్థితుల్లో తమ జట్టును అక్కడికి పంపిన విషయాన్ని ఆ లేఖలో లంక గుర్తుచేసింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు, భద్రతా చర్యలు, ఇతరత్రా ఏర్పాట్ల గురించి అందులో పేర్కొంది. అటు పీసీబీ బాయ్‌కాట్‌తో లంక బోర్డుకు ఆర్థికంగా భారీ నష్టం చేకూరనుంది.
ఇవి కూడా చదవండి:
అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!