Share News

డోప్‌ పరీక్షలో దొరికిన పాక్‌ క్రికెటర్‌

ABN , Publish Date - Apr 23 , 2026 | 01:51 AM

పాకిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నవాజ్‌ చిక్కుల్లో పడ్డాడు. టీ20 వరల్డ్‌ కప్‌ సందర్భంగా అతడు ‘రిక్రియేషనల్‌ డ్రగ్‌’ తీసుకోవడంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) విచారణకు...

డోప్‌ పరీక్షలో దొరికిన పాక్‌ క్రికెటర్‌

నవాజ్‌పై విచారణకు ఆదేశించిన పీసీబీ

లాహోర్‌: పాకిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నవాజ్‌ చిక్కుల్లో పడ్డాడు. టీ20 వరల్డ్‌ కప్‌ సందర్భంగా అతడు ‘రిక్రియేషనల్‌ డ్రగ్‌’ తీసుకోవడంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) విచారణకు ఆదేశించింది. గత ఫిబ్రవరి-మార్చిలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ సందర్భంగా 32 ఏళ్ల నవాజ్‌ ఆ డ్రగ్‌ తీసుకొన్నాడు. మెగా టోర్నీ సమయంలో క్రికెటర్లకు ఐసీసీ నిర్వహించిన డోప్‌ పరీక్షల్లో పాకిస్థాన్‌ ఆటగాడికి పాజిటివ్‌గా వచ్చింది. ఈ విషయాన్ని పీసీబీకి ఐసీసీ తెలియజేసింది. దాంతో నవాజ్‌పై పీసీబీ విచారణ చేపట్టింది. స్పిన్‌ బౌలింగ్‌తోపాటు లోయరార్డర్‌లో చెప్పుకోదగ్గ బ్యాటర్‌ అయిన నవాజ్‌..వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ పాల్గొన్నాడు.

ఇవి కూడా చదవండి:

డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్‌ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ

భారత లీగ్‌లో ఆడినందుకు ఆసీస్ మాజీ ప్లేయర్‌పై వేటు

Updated Date - Apr 23 , 2026 | 01:51 AM