Share News

కెప్టెన్‌ను డమ్మీ చేశాడు..

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:41 AM

శ్రీలంకతో సూపర్‌-8 మ్యాచ్‌ అనంతరం పాకిస్థాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా ఆ దేశ జర్నలిస్టుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది....

కెప్టెన్‌ను డమ్మీ చేశాడు..

ఆఘాపై పాక్‌ జర్నలిస్టుల ఆగ్రహం

పల్లెకెలె/కరాచీ: శ్రీలంకతో సూపర్‌-8 మ్యాచ్‌ అనంతరం పాకిస్థాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా ఆ దేశ జర్నలిస్టుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కోచ్‌ మైక్‌ హెసన్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని, సల్మాన్‌ను డమ్మీ కెప్టెన్‌ చేశాడని మ్యాచ్‌ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో నిలదీశారు. అంతేకాదు..స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ సేవలను సరైన రీతిలో వినియోగించుకోలేదని మండిపడ్డారు. ప్రపంచ కప్‌లో చెత్త ప్రదర్శనపై పాకిస్థాన్‌ మాజీలు తీవ్ర నిరాశలో కూరుకు పోయారు. ‘రెండేళ్లకొకసారి దక్కే అవకాశంలో పాకిస్థాన్‌ క్రికెటర్లు సత్తా చాటడంలో విఫలమయ్యారు. ఇది ఎంతో నిరాశకు లోనుచేస్తోంది’ అని మాజీ కెప్టెన్‌ మియాందాద్‌ నిర్వేదంగా అన్నాడు.

ఇవి కూడా చదవండి

చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

Updated Date - Mar 02 , 2026 | 04:41 AM