Share News

మాకు మరో మార్గం లేదు

ABN , Publish Date - Feb 03 , 2026 | 05:48 AM

భారత్‌తో టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ను బహిష్కరిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నోరు మెదపడంలేదు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని...

మాకు మరో మార్గం లేదు

ప్రభుత్వ సూచనలు పాటిస్తామన్న పాక్‌ కెప్టెన్‌ ఆఘా

కరాచీ: భారత్‌తో టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ను బహిష్కరిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నోరు మెదపడంలేదు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని శిరసావహించడం తప్ప తమకు మరో మార్గం లేదని బోర్డు వర్గాలు భావిస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. ఈనెల 7న నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ ద్వారా వరల్డ్‌ కప్‌ను పాకిస్థాన్‌ జట్టు ప్రారంభించనుంది. ఇక తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి తమకు అందే సూచనలను జట్టు పాటిస్తుందని పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా తెలిపాడు. ‘మేం బోర్డుతో కాంట్రాక్టు ఉన్న క్రికెటర్లం. అందువల్ల ప్రభుత్వం, బోర్డు తీసుకొనే నిర్ణయాలను అమలు చేస్తాం’ అని లాహోర్‌ నుంచి సోమవారం కొలంబో బయలుదేరిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆఘా అన్నాడు. కాగా.. పాక్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ మాజీ కెప్టెన్లు షాహిద్‌ అఫ్రీది, రషీద్‌ లతీఫ్‌ సమర్థించారు. ‘బీసీసీఐకి ఐసీసీ అణిగిమణిగి ఉండడం చూస్తే.. దానికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది’ అని లతీఫ్‌ పేర్కొనగా.. క్రీడలతో రాజకీయాలను ముడిపెట్టడాన్ని తాను సమర్థించనని, కానీ పాక్‌ ప్రభుత్వ బహిష్కరణ నిర్ణయాన్ని అర్థం చేసుకోగలనని అఫ్రీది అన్నాడు.

ఇవీ చదవండి:

ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం

Updated Date - Feb 03 , 2026 | 05:48 AM