ఐపీఎల్‌కు ఒవర్టన్ దూరం
ABN , Publish Date - May 15 , 2026 | 01:50 AM
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని ఆటగాళ్ల గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు ఇదే కారణంతో జట్టుకు దూరం కాగా....
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని ఆటగాళ్ల గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు ఇదే కారణంతో జట్టుకు దూరం కాగా.. తాజాగా జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆల్‌రౌండర్ ఒవర్టన్ కూడా లీగ్‌ను వీడాడు. సీఎ్‌సకే తరఫున పది మ్యాచ్‌ల్లో తను 14 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే తొడ కండర గాయంతో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన ఒవర్టన్ స్వదేశం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డియాన్ ఫారెస్టర్‌ను కనీస ధర రూ.75 లక్షలకు తీసుకున్నారు.
వార్తలు కూడా చదవండి
ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్
శ్రీలంక టూర్.. భారత- ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ