Share News

రెండోది.. కివీస్‌ వశం

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:38 AM

తొలి టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఆతిథ్య న్యూజిలాండ్‌ రెండో మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీ్‌సలో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన రెండో...

రెండోది.. కివీస్‌ వశం

సఫారీలపై భారీ గెలుపు

హామిల్టన్‌: తొలి టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఆతిథ్య న్యూజిలాండ్‌ రెండో మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీ్‌సలో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన రెండో టీ20లో కివీస్‌ 68 పరుగుల తేడాతో సఫారీలపై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (60) అర్ధ సెంచరీతో అలరించాడు. జోష్‌ క్లార్క్‌సన్‌ 26 రన్స్‌ చేశాడు. ముల్డర్‌ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో కివీస్‌ బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా 15.3 ఓవర్లలోనే 107 పరుగులకే ఆలౌటైంది. జార్జ్‌ లిండె (33) టాప్‌ స్కోరర్‌. ఫెర్గూసన్‌, బెన్‌ సియర్స్‌ చెరో మూడు..శాంట్నర్‌ రెండు, నీషమ్‌ ఓ వికెట్‌ తీశారు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!

NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం

Updated Date - Mar 18 , 2026 | 02:38 AM