నేపాల్‌కో గెలుపు
ABN , Publish Date - Feb 18 , 2026 | 03:00 AM
దీపేంద్ర సింగ్ ఐరీ (23 బంతు ల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 నాటౌట్) అజేయ అర్ధ శతకంతో అదరగొట్టడంతో.. టీ20 వరల్డ్‌క్‌పలో నేపాల్ తొలి విజయాన్ని...
చెలరేగిన ఐరీఫ పోరాడి ఓడిన స్కాట్లాండ్
ముంబై: దీపేంద్ర సింగ్ ఐరీ (23 బంతు ల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 నాటౌట్) అజేయ అర్ధ శతకంతో అదరగొట్టడంతో.. టీ20 వరల్డ్‌క్‌పలో నేపాల్ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-సిలో మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నేపాల్ 7 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తు చేసింది. తొలుత స్కాట్లాండ్ 20 ఓవర్లలో 170/7 స్కోరు చేసింది. ఓపెనర్ మైకేల్ జోన్స్ (71) అర్ధ శతకం సాధించగా.. జార్జ్ మున్సే (27), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (25) ఫర్వాలేదనిపించారు. సోమ్‌పాల్ కామీ మూడు, నందన్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో నేపాల్ 19.2 ఓవర్లలో 171/3 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లు కుశాల్ భుర్టెల్ (43), ఆసిఫ్ షేక్ (33) రాణించారు. మైకేల్ లీస్క్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?
ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ