సఫారీలకు నమీబియా షాక్
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:27 AM
టీ20 క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు పసికూన నమీబియా షాకిచ్చింది...
విందోక్: టీ20 క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు పసికూన నమీబియా షాకిచ్చింది. ముక్కోణపు టీ20 సిరీ్‌సలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య నమీబియా 18 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసింది. తొలుత నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు సాధించింది. ఓపెనర్లలో జాన్ ఫ్రైలింక్ (60) అర్ధ సెంచరీ కొట్టగా, లారెన్ స్టీన్‌కాంప్ (41) రాణించాడు. ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 145/9 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. డెవాల్డ్ బ్రెవిస్ (75) రాణించాడు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెలమన్, జేజే స్మిట్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. నమీబియా చేతిలో ఓడడం దక్షిణాఫ్రికాకు ఇది రెండోసారి. పదినెలల క్రితం ఇదే వేదికపై టీ20 మ్యాచ్‌లో నమీబియా గెలిచింది.
ఇవి కూడా చదవండి:
టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!
అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు