Share News

షంటో సెంచరీ

ABN , Publish Date - May 09 , 2026 | 02:26 AM

కెప్టెన్‌ నజ్ముల్‌ హుస్సేన్‌ షంటో (101) సెంచరీ సాధించడంతో పాకిస్థాన్‌తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్‌...

షంటో సెంచరీ

బంగ్లా 301/4 జూపాక్‌తో తొలి టెస్టు

మిర్పూర్‌: కెప్టెన్‌ నజ్ముల్‌ హుస్సేన్‌ షంటో (101) సెంచరీ సాధించడంతో పాకిస్థాన్‌తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్‌ భారీస్కోరు దిశగా దూసుకెళ్తోంది. శతక వీరుడు షంటోకు తోడు మోమినుల్‌ హక్‌ (91) సత్తా చాటడంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 4 వికెట్లకు 301 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (48), లిట్టన్‌ దాస్‌ (8) క్రీజులో ఉన్నారు. కాగా, ఈ ఇన్నింగ్స్‌తో షంటో.. టెస్టుల్లో పాకిస్థాన్‌పై సెంచరీ బాదిన తొలి బంగ్లా కెప్టెన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాక్‌పై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బంగ్లా కెప్టెన్‌గా ముష్ఫికర్‌ రహీమ్‌ (53 రన్స్‌) రికార్డును షంటో అధిగమించాడు.

ఇవి కూడా చదవండి:

సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

Updated Date - May 09 , 2026 | 02:26 AM