ముంబై శివార్లలో భారీ స్టేడియం
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:03 AM
అహ్మదాబాద్ స్టేడియాన్ని తలదన్నేలా ముంబై శివార్లలో భారీ క్రికెట్ మైదానాన్ని నిర్మించేందుకు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సన్నాహకాలు...
ముంబై: అహ్మదాబాద్ స్టేడియాన్ని తలదన్నేలా ముంబై శివార్లలో భారీ క్రికెట్ మైదానాన్ని నిర్మించేందుకు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సన్నాహకాలు చేస్తోంది. అత్యంత ఆధునిక సౌకర్యాలతోపాటు లక్ష సీటింగ్ కెపాసిటీతో స్టేడియాన్ని నిర్మించాలనుకొంటున్నారు. గత రెండేళ్లుగా ఈ ప్రతిపాదన నానుతున్నా.. తాజాగా సిటీ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర డైరెక్టర్ విజయ్ సింఘాల్‌తో ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ భేటీ కావడంతో మళ్లీ కదలిక వచ్చింది. ‘మెట్రోపాలిటన్ రీజియన్‌లో లక్ష సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం మహారాష్ట్రకే మకుటం వంటిది. రాష్ట్ర క్రీడా చరిత్రలోనే ఎంతో కీలకమైన సందర్భమ’ని నాయక్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపాడు. అవసరమైన భూసేకరణ విషయంలో ప్రభుత్వం సహకరించాలని కోరాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: అరుదైన మైలురాయిని తాకిన అజింక్య రహానే
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు