ముకుల్ మార్చేశాడు..
ABN , Publish Date - Apr 10 , 2026 | 02:02 AM
ఐపీఎల్‌లో మరో హైడ్రామా మ్యాచ్. ఈడెన్ గార్డెన్స్‌లో ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన పోరులో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అదరగొట్టింది. ఎవరి అంచనాల్లోనూ లేని 21 ఏళ్ల ముకుల్...
నేటి మ్యాచ్
రాజస్థాన్ X బెంగళూరు
వేదిక గువాహటి రా.7.30 నుంచి
అనూహ్య ఆటతీరుతో విరుచుకుపడ్డ బ్యాటర్
ఆఖరి బంతికి లఖ్‌నవూ విజయం
కోల్‌కతాకు మరో ఓటమి
కోల్‌కతా: ఐపీఎల్‌లో మరో హైడ్రామా మ్యాచ్. ఈడెన్ గార్డెన్స్‌లో ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన పోరులో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అదరగొట్టింది. ఎవరి అంచనాల్లోనూ లేని 21 ఏళ్ల ముకుల్ చౌధరి (27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 54 నాటౌట్) కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చుక్కలు చూపించాడు. ఓటమి దిశగా సాగుతున్న తమ జట్టును ఆఖరి బంతి వరకు పట్టు వీడకుండా ఆడి గట్టెక్కించాడు. ఫలితంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఎల్‌ఎ్‌సజీ 3 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. రఘువంశీ (33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), రహానె (24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), పోవెల్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 నాటౌట్), గ్రీన్ (24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 నాటౌట్) రాణించారు. ఆ తర్వాత ఛేదనలో లఖ్‌నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 182/7 పరుగులు చేసి గెలిచింది. బదోని (34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 54) రాణించాడు. అనుకుల్, వైభవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ముకుల్ నిలిచాడు.
ముకుల్ ఎడాపెడా..: పడుతూ లేస్తూ సాగిన లఖ్‌నవూ ఛేదనకు యువ బ్యాటర్ ముకుల్ అద్భుత ఆటతీరుతో ఫినిషింగ్ ఇచ్చాడు. ఓపెనర్లు మార్‌క్రమ్ (22), మార్ష్ (15) ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించినా ఐదో ఓవర్‌లో పేసర్ వైభవ్ అరోరా వారికి ఝలక్ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ పంత్‌ను గ్రీన్ అవుట్ చేయడంతో కీలక వికెట్ కోల్పోయినట్టయింది. ఈ సీజన్‌లో గ్రీన్ బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. ఇలాంటి స్థితిలో బదోని ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతడికి జతగా పూరన్ (13) క్రీజులో ఉండడంతో లఖ్‌నవూకే విజయావకాశాలు కనిపించాయి. కానీ కేకేఆర్ బౌలర్లు వరుస ఓవర్లలో పూరన్, సమద్ (2)ల వికెట్లు తీయడంతో 104/5 స్కోరుతో ఒత్తిడి పెరిగింది. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బదోనిని 15వ ఓవర్‌లో అనుకుల్ అవుట్ చేయడంతో మ్యాచ్ కేకేఆర్ వైపు తిరిగింది. అప్పటికి లఖ్‌నవూ 32 బంతుల్లో 57 పరుగులు చేయాల్సింది. క్రీజులో చెప్పుకోదగ్గ బ్యాటర్ లేకపోవడంతో ఎల్‌ఎ్‌సజీ ఓటమి ఖాయమనిపించింది. కానీ ఊహించని రీతిలో ఏడో నెంబర్ బ్యాటర్ ముకుల్ చౌధరి విశ్వరూపం చూపాడు. హెలికాప్టర్ సిక్సర్లతో ఈడెన్‌ను హోరెత్తిస్తూ లక్ష్యాన్ని కరిగించాడు. దీంతో ఆరు బంతుల్లో 14 రన్స్ చేయాల్సి రాగా.. మరో రెండు సిక్సర్లు బాది చివరి బంతికి సింగిల్‌తో మ్యాచ్‌ను అద్భుతరీతిలో ముగించాడు.
చివర్లో దూకుడు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఆరంభం.. ముగింపు మాత్రమే ఫర్వాలేదనిపించింది. మధ్య ఓవర్లలో లఖ్‌నవూ బౌలర్లు పూర్తి ఆధిపత్యం చూపారు. అయితే డెత్ ఓవర్లలో పోవెల్ వేగంగా ఆడి జట్టుకు సవాల్ విసిరే స్కోరందించాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ఆలెన్ (9) వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ రహానె-రఘువంశీ జోడీ నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. ఆరో ఓవర్‌లో రఘువంశీ 4,6,4తో పవర్‌ప్లేను 56/1తో ముగించాడు. ఆ తర్వాత కూడా ఇద్దరూ ఎదురుదాడిసాగించడంతో కనీసం 200 స్కోరు ఖాయమనిపించింది. కానీ 11వ ఓవర్‌లో రహానెను స్పిన్నర్ దిగ్వేష్ అవుట్ చేయగా, తర్వాతి ఓవర్‌లోనే రఘువంశీని సిద్ధార్థ్ వెనక్కిపంపాడు. అటు రింకూ (4)ను పేసర్ అవేశ్ బౌల్డ్ చేయడంతో వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. దీనికి తోడు 11-15 ఓవర్ల మధ్య కేవలం 17 పరుగులే రాగా, ఇందులో ఒక్క ఫోర్ కూడా లేదు. ఆ తర్వాత పోవెల్ బ్యాట్ ఝుళిపించడంతో స్కోరుబోర్డు వేగం పుంజుకుంది. అయితే గ్రీన్ మొదట్లో షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు. తానెదుర్కొన్న 20వ బంతికి ఓ సిక్స్ బాది ఒత్తిడి తగ్గించుకున్నాడు. కేకేఆర్ ఆఖరి ఐదు ఓవర్లలో 66 పరుగులు రాబట్టి స్కోరును కూడా 180 దాటించింది. అలాగే ఐదో వికెట్‌కు వీరు అజేయంగా 70 పరుగులు జోడించారు.
స్కోరుబోర్డు
కోల్‌కతా: రహానె (సి) షమి (బి) దిగ్వేష్ 41, ఆలెన్ (సి) దిగ్వేష్ (బి) ప్రిన్స్ 9, రఘువంశీ (సి) మార్‌క్రమ్ (బి) సిద్ధార్థ్ 45, గ్రీన్ (నాటౌట్) 32, రింకూ (బి) అవేశ్ 4, పోవెల్ (నాటౌట్) 39, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 181/4. వికెట్ల పతనం: 1-15, 2-99, 3-105, 4-111. బౌలింగ్: షమి 4-0-27-0, ప్రిన్స్ 4-0-47-1, సిద్ధార్థ్ 4-0-34-1, దిగ్వేష్ 4-0-25-1, అవేశ్ 4-0-44-1.
లఖ్‌నవూ: మార్ష్ (సి) రఘువంశీ (బి) అరోరా 15, మార్‌క్రమ్ (సి) పోవెల్ (బి) అరోరా 22, పంత్ (సి) త్యాగి (బి) గ్రీన్ 10, బదోని (సి) రింకూ (బి) అనుకుల్ 54, పూరన్ (సి) రమణ్‌దీప్ (బి) త్యాగి 13, సమద్ (బి) అనుకుల్ 2, ముకుల్ (నాటౌట్) 54, షమి (సి) అనుకుల్ (బి) నరైన్ 1, అవేశ్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 182/7. వికెట్ల పతనం: 1-41, 2-42, 3-73, 4-95, 5-104, 6-125, 7-128. బౌలింగ్: వైభవ్ అరోరా 4-0-38-2, అనుకుల్ 4-0-32-2, సైనీ 3-0-37-0, నరైన్ 4-0-13-1, త్యాగి 3-0-31-1, గ్రీన్ 2-0-28-1.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య