Share News

డీజీపీ ఆనంద్‌ను కలిసిన సిరాజ్‌

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:03 AM

డీజీపీ సీవీ ఆనంద్‌ను భారత క్రికెటర్‌, డీఎస్పీ మహ్మద్‌ సిరాజ్‌ మర్యాదపూర్వకంగా కలిశాడు. సోమవారం...

డీజీపీ ఆనంద్‌ను కలిసిన సిరాజ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): డీజీపీ సీవీ ఆనంద్‌ను భారత క్రికెటర్‌, డీఎస్పీ మహ్మద్‌ సిరాజ్‌ మర్యాదపూర్వకంగా కలిశాడు. సోమవారం డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సిరాజ్‌, ఆనంద్‌కు పుష్పగుచ్చం ఇచ్చి, డీజీపీగా బాధ్యతలు తీసుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన టీమిండియా జెర్సీని ఆనంద్‌కు సిరాజ్‌ బహూకరించాడు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సిరాజ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

ఇవి కూడా చదవండి:

యమాల్ విజయం వెనుక నానమ్మ త్యాగం.. కష్టాల నుంచి ప్రపంచ స్టార్‌గా..!

రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన

Updated Date - Jul 21 , 2026 | 05:03 AM