Share News

‘సిరాజ్‌’..అందుకే చోటు దక్కలేదు

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:49 AM

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టులో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చోటు కల్పించకపోవడం క్రికెట్‌ వర్గాల్లోనే కాదు...

‘సిరాజ్‌’..అందుకే చోటు దక్కలేదు

కాంగ్రెస్‌ ఎంపీ ఆరోపణ

ఆ పార్టీవి ఓటు బ్యాంకు రాజకీయాలు

తిప్పికొట్టిన బీజేపీ

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టులో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చోటు కల్పించకపోవడం క్రికెట్‌ వర్గాల్లోనే కాదు రాజకీయంగానూ వివాదానికి దారి తీసింది. సిరాజ్‌పట్ల వివక్ష చూపిస్తున్నారని కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యుడు ఇమ్రాన్‌ మసూద్‌ ఆరోపించారు. అయితే మసూద్‌ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తింది. ‘సిరాజ్‌ చక్కగా రాణిస్తున్నా అతడికి తుది 11 మందిలో స్థానం లేదు. అతడి పేరు ‘సిరాజ్‌’ కావడమే తుది జట్టునుంచి పక్కనబెట్టడానికి కారణం’ అని మసూద్‌ మండిపడ్డారు. ఇమ్రాన్‌ వ్యాఖ్యలను బీజేపీ అధికారి ప్రతినిధి ప్రదీప్‌ భండారీ ఖండిస్తూ ‘క్రికెట్‌ జట్టు ఎంపికలోనూ కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నది. సిరాజ్‌నే కాదు.. జడేజాను కూడా జట్టులోకి తీసుకోలేదు. ఓటు బ్యాంకు, మత రాజకీయాలకోసం భారత జట్టులో చీలిక తీసుకురాకండి’ అని భండారీ హితవు పలికారు. కాగా..సిరాజ్‌కు తుది జట్టులో చోటు లభించకపోవడాన్ని దిగ్గజ క్రికెటర్లు గవాస్కర్‌, రవిశాస్త్రి తప్పుబట్టిన సంగతి తెలిసిందే. సిరాజ్‌ అనుభవం దృష్ట్యా అతడిని ఆడించాల్సిందని వారు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

'అతిపెద్ద ద్రోహి'.. ఖవాజాపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆగ్రహం!

ధోని ఆటకు పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ముగ్దులయ్యారు: శుక్లా

Updated Date - Nov 21 , 2026 | 05:49 AM