గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే!
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:21 AM
కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూడగా.. దానిని విరుద్ధంగా వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో...
న్యూఢిల్లీ: కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూడగా.. దానిని విరుద్ధంగా వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జింబాబ్వే టూర్‌లో టీమిండియా అదరగొట్టింది. ఈ క్రమంలో జట్టు కూర్పు లో గౌతీ, లక్ష్మణ్ మధ్య గల తేడాను టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ వివరించాడు. గౌతీ ఎక్కువగా ఆల్‌రౌండర్లపై ఆధారపడితే.. లక్ష్మణ్ ఏడుగురు బ్యాటర్లు, నలుగురు బౌలర్ల సంప్రదాయ విధానానికే కట్టుబడ్డాడని చెప్పాడు. ఎనిమిదో స్థానంలో ఆల్‌రౌండర్‌ను ఆడించేందుకు ఒక బౌలర్‌ను లక్ష్మణ్ త్యాగం చేయలేదన్నాడు. ఈ విషయంలోనే గౌతీ ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నట్టు చెప్పాడు. ప్రతికూల ఫలితాలు కోచ్‌పైనే కాదు, కెప్టెన్‌పైనా ప్రభావం చూపిస్తాయని కైఫ్ అన్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో భారత్ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న క్రమంలో శుభ్‌మన్ గిల్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలన్న ఆసక్తితో ఉన్నట్టు కైఫ్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే
ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ