ఒకే జట్టులో అబ్బాయిలు, అమ్మాయిలు
ABN , Publish Date - Oct 17 , 2026 | 02:42 AM
అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే జట్టులో తలపడే మిక్స్డ్ జెండర్ క్రికెట్ టోర్నమెంట్కు తెర లేవనుంది. తొలిసారిగా 80 ఓవర్ల ఫార్మాట్లో ‘టెస్ట్ ట్వంటీ’ పేరిట ఈ టోర్నీ జరుగనుంది.
మిక్స్డ్ జెండర్ క్రికెట్
కొలంబో: అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే జట్టులో తలపడే మిక్స్డ్ జెండర్ క్రికెట్ టోర్నమెంట్కు తెర లేవనుంది. తొలిసారిగా 80 ఓవర్ల ఫార్మాట్లో ‘టెస్ట్ ట్వంటీ’ పేరిట ఈ టోర్నీ జరుగనుంది. నాలుగు ఖండాల నుంచి ఎంపిక చేసిన 13-21 ఏళ్ల మధ్య వయస్సున్న 160 మంది బరిలోకి దిగనున్నారు. వచ్చే నెల 14 నుంచి 29 వరకు కొలంబోలో జరిగే ఈ టోర్నీలో నాలుగు జట్లు పాల్గొంటాయి.
ప్రతీ జట్టులో 20 మంది అమ్మాయిలు, 20 మంది అబ్బాయిలు ఉంటారు. ఒకే రోజు 80 ఓవర్ల మ్యాచ్ జరుగనుండగా, రెండు జట్లు 20 ఓవర్ల చొప్పున రెండేసి సార్లు ఆడతాయి. ఒకసారి బాలురు, ఇంకోసారి బాలికలు దిగుతారు. బాలబాలికలకు సమాన అవకాశాలు ఇవ్వడమే ఈ టోర్నీ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
జింబాబ్వేతో తొలి టీ20: కెప్టెన్గా స్మృతి.. టాస్ నెగ్గిన భారత్
వైభవ్ ఆడితే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: టీమిండియా మాజీ కోచ్