Share News

స్టార్క్‌ వస్తున్నాడు..

ABN , Publish Date - Apr 24 , 2026 | 01:35 AM

స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతించింది. దీంతో ఈ వెటరన్‌ మే ఒకటిన రాజస్థాన్‌ రాయల్స్‌తో...

స్టార్క్‌ వస్తున్నాడు..

సిడ్నీ: స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతించింది. దీంతో ఈ వెటరన్‌ మే ఒకటిన రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలోకి దిగడం ఖాయమైంది. మోచేయి, భుజం నొప్పి కారణంగా జనవరి నుంచి స్టార్క్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో స్టార్క్‌ 11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టు మూడు ఓటములు, మూడు విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ఇదిలావుండగా టోర్నీకి ముందే ఐపీఎల్‌నుంచి తప్పుకొన్న బెన్‌ డకెట్‌ స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన రెహాన్‌ అహ్మద్‌ను తీసుకున్నారు. ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను రూ.75 లక్షలకు తీసుకుంటున్నట్టు ఢిల్లీ జట్టు యాజమాన్యం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం

Updated Date - Apr 24 , 2026 | 01:35 AM