Share News

శాండ్‌పేపర్‌ గురించి తెలీదు

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:14 AM

దక్షిణాఫ్రికాతో టెస్టులో జరిగిన బాల్‌ టాంపరింగ్‌ వివాదంలోముగ్గురినే బాధ్యులను చేయడం సరికాదని, ఆ విషయం...

శాండ్‌పేపర్‌ గురించి తెలీదు

ఆసీస్‌ పేసర్‌ స్టార్క్‌

మెల్‌బోర్న్‌: దక్షిణాఫ్రికాతో టెస్టులో జరిగిన బాల్‌ టాంపరింగ్‌ వివాదంలోముగ్గురినే బాధ్యులను చేయడం సరికాదని, ఆ విషయం జట్టులో అందరికీ తెలుసని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఖవాజా ఇటీవల తన ఆత్మకథలో పేర్కొనడం సంచలనంగా మారింది. 2018లో జరిగిన ఈ ఉదంతంతో డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, బాన్‌క్రా్‌ఫ్టలపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఖవాజా ఆరోపణలను పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఖండించాడు. ‘2021లో ఈ అంశంపై నేను సమాధానమిచ్చా. ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నా. మైదానంలో జరిగిన శాండ్‌పేపర్‌ విషయం గురించి మాకు తెలీదు’ అని స్టార్క్‌ తేల్చాడు. మరోవైపు ఖవాజా చెప్పింది వంద శాతం కరెక్ట్‌ అంటూ వార్నర్‌ మద్దతిచ్చాడు.

ఈ వార్తలనూ చదవండి:

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..

Updated Date - Nov 11 , 2026 | 05:15 AM