Share News

మనల్‌, కుశాగ్ర సెంచరీలు

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:18 AM

శ్రీలంక అండర్‌-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో భారత కుర్రాళ్లు చెలరేగారు. మనల్‌ చౌహాన్‌ (150), కుశాగ్ర (111) సెంచరీలతో పాటు...

మనల్‌, కుశాగ్ర సెంచరీలు

  • భారత్‌ అండర్‌-19 411 ఆలౌట్‌

  • శ్రీలంక అండర్‌-19 122/8

కొలంబో: శ్రీలంక అండర్‌-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో భారత కుర్రాళ్లు చెలరేగారు. మనల్‌ చౌహాన్‌ (150), కుశాగ్ర (111) సెంచరీలతో పాటు కెప్టెన్‌ యష్‌బర్దన్‌ (78) ఆకట్టుకున్నాడు. దీంతో మంగళవారం ఆటలో భారత్‌ అండర్‌-19 జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 411 పరుగులకు ఆలౌటైంది. గింహాన్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత మన బౌలర్లు సైతం ప్రభావం చూపడంతో శ్రీలంక ఇబ్బందుల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక తొలి ఇన్నింగ్స్‌లో 122/8 పరుగులు చేసింది. దుల్నీత్‌ (31) టాప్‌ స్కోరర్‌. ప్రస్తుతం ఆ జట్టు 289 పరుగులు వెనుకబడి ఉండగా.. క్రీజులో సెత్మిక (4 బ్యాటింగ్‌), గింహాన్‌ (4 బ్యాటింగ్‌) ఉన్నారు. రోహిత్‌, వెంకట్‌, ప్రణవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా

రోహిత్ శర్మ ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి

Updated Date - Jul 22 , 2026 | 05:19 AM